Breaking News

‘ఒంటెలను ఇవ్వండి’.. పోలీసులకు జడ్జి ఆదేశం!

Published on Wed, 02/28/2024 - 14:06

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి తమ 22 ఒంటెలను పోలీసుల నుంచి తిరిగి ఇప్పించాలని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన కోర్టు.. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నుండి సమాధానం కోరింది. ఈ కేసు రాబోయే మార్చి లో విచారణకు రానుంది.

ఈ కేసు 2019 నుంచి నడుస్తోంది.  ఆ ఏడాది ఆగస్టు లో ఈద్ సందర్భంగా ఒంటెలను బలి ఇవ్వడాన్ని పోలీసు యంత్రాంగం నిషేధించింది. ఈ నేపధ్యంలో మీరట్‌లోని మహ్మద్ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను లిసాడి గేట్ పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.  ఎంతకాలమైనా ఆ ఒంటెలను పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో అనాస్ 2022లో హైకోర్టును ఆశ్రయించాడు. తన ఒంటెలను తిరిగి ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2023, జనవరి 12న ఒంటెలను అతనికి తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, అయితే పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించలేదని అనాస్‌ తరపు న్యాయవాది షామ్స్-ఉ-జమాన్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు ఈ ఉదంతంపై తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు మార్చి 18న కోర్టులో విచారణకు రానుంది. ఈ విషయమై సిటీ మేజిస్ట్రేట్ మాట్లాడుతూ అనాస్‌కు చెందిన 22 ఒంటెలను పోలీసులు తిరిగి అతని ఇవ్వని విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే  లిసాడి గేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నుంచి దీనికి తక్షణం సమాధానం కోరామన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)