Breaking News

Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్‌

Published on Sat, 09/14/2024 - 07:33

గజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌ జిల్లాలోని లోని బోర్డర్ ప్రాంతంలో పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్న 29 ఏళ్ల వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల మైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంకుర్ విహార్ ఏరియా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) భాస్కర్ వర్మ తెలిపిన వివరాల ‍ప్రకారం ఒక జ్యూస్ విక్రేత పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నాడని పలువురు వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ జ్యూస్ విక్రయిస్తున్న వ్యక్తిని అమీర్ (29)గా గుర్తించినట్లు వర్మ తెలిపారు. అతని జ్యూస్ స్టాల్ నుంచి మూత్రం నింపిన డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీసులు అమీర్‌ను విచారించి, అరెస్టు చేశారన్నారు.  అతని దగ్గర పనిచేస్తున్న ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు  తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భాస్కర్ వర్మ పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలోని ఛుత్మల్‌పూర్‌లో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒక ధాబాలో తాండూర్‌లో రోటీలు కాల్చడానికి ముందు దానిని తయారు చేస్తున్న వ్యక్తి వాటిపై ఉమ్మి వేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు. తరువాత ఆ ధాబాను మూసివేయించారు. 

ఇది కూడా చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)