Breaking News

PM Ujjwala Scheme: మరో 75 లక్షల ‘ఉజ్వల’కనెక్షన్లు

Published on Thu, 09/14/2023 - 03:14

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)కింద అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,650 కోట్లు కేటాయించింది. దీంతోపాటు, ఈ కోర్ట్స్‌’ ప్రాజెక్టు మూడో దశకు అనుమతి మంజూరుచేసింది. ఇందుకు గాను రూ.7,210 కోట్లు వెచి్చంచాలని తీర్మానించింది. ఇటీవల ముగిసిన జీ20ని విజయవంతం చేసి, భారత్‌ ప్రతిష్టను ఇనుమడింప జేసిన ప్రధాని మోదీని ఈ సమావేశం అభినందించింది. ఈ వివరాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

కొత్తగా జారీ అయ్యే 75 లక్షల ఉజ్వల ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లను 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అందజేస్తామని తెలిపారు. వీటితో కలిపి ఉజ్వల లబి్ధదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుందన్నారు. దిగువ కోర్టుల్లో రికార్డుల డిజిటైజేషన్, క్లౌడ్‌ స్టోరేజీ, వర్చువల్‌ కోర్టుల ఏర్పాటు తదితరాల కోసం నాలుగేళ్లపాటు అమలయ్యే ఈకోర్ట్స్‌ ప్రాజెక్టు ఫేజ్‌–3కి రూ.7,210 కోట్లు కేటాయించేందుకు కూడా కేబినెట్‌ అంగీకరించిందని ఠాకూర్‌ చెప్పారు. ఇందులో భాగంగా 3,108 కోట్ల డాక్యుమెంట్లు డిజిటల్‌ రూపంలోకి మారుతాయని అంచనా.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)