Breaking News

ఆశలు నెరవేర్చే పార్టీలనే నమ్ముతారు

Published on Tue, 11/18/2025 - 05:32

న్యూఢిల్లీ: సదుద్దేశంతో ముందడుగు వేసి, తమ ఆశయాలను నెరవేర్చే రాజకీయ పార్టీలనే ప్రజలు విశ్వసిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఆరో రామ్‌నాథ్‌ గోయంకా స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీనా, మితవాద పార్టీనా అనేది ముఖ్యంకాదు. అభివృద్ధి విధానాలతో ఏ పార్టీ అయితే ముందుకెళ్తుందో ఆ పార్టీలకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని బిహార్‌లో తాజా శాసనసభ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. 

ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కేంద్రంలో లేదా రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాల దృష్టి మొత్తం అభివృద్ధి మీదనే ఉండాలి. భారతదేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెద్దగానే ఉంటాయని బిహార్‌ ఎన్నికలు నిరూపించాయి. అధికారం చేపట్టి సదుద్దేశంతో సత్కార్యాలు చేసే రాజకీయ పక్షాల వెంటే ప్రజలు నడుస్తారు. మళ్లీ వాళ్లకే ఓటేస్తారు. అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుంటారు. విదేశాల నుంచి తమ రాష్ట్రానికే భారీ పెట్టుబడులు వచ్చేలా బడా కంపెనీలను ఆకర్షిస్తూ, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే రాష్ట్ర ప్రభుత్వా లను ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది’’ అని అన్నారు. 

ఎలక్షన్‌ మోడ్‌ కాదు ఎమోషనల్‌ మోడ్‌
‘‘బీజేపీ ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టిపెడుతుందని కొందరు అ భాండాలు వేస్తున్నారు. నిజానికి మేం ఎలక్షన్‌ మోడ్‌లో ఉండబోం. ఎన్నికల ప్రచారంవేళ ప్రజలతో మమేకమయ్యే ఎమోషనల్‌ మోడ్‌లో ఉంటాం. రోజూ 24 గంటలూ అభివృద్ధి, ప్రజల భావోద్వేగాల గురించే పట్టించుకుంటాం. అందుకే ప్రతిసారి మాకు విజయం దక్కుతోంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ నక్సలిజం, మావోయిస్ట్‌ టెర్రరిజంకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్‌ దేశంలో ఉనికిని కోల్పోతోంది. కేవలం విపక్షపార్టీగా మాత్రమే మిగిలిపోతోంది. గత ఐదు దశాబ్దాల్లో దేశంలో ప్రతి రాష్ట్రం మావోయిస్టుల దురాగతాలను చవిచూసింది. దేశ రాజ్యాంగాన్ని నమ్మని అలాంటి వాళ్లను కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ ఆరోపించారు.  

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)