Breaking News

భయంతోనే డుమ్మా 

Published on Tue, 02/10/2026 - 03:59

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో పాటు దేశ భద్రత, ప్రజా ప్రయోజనాలతో ముడిపడ్డ పలు అంశాలపై బదులివ్వడానికి మోదీ సర్కారు భయపడుతోందని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరగాల్సిన చర్చ నుంచి పారిపోతోందని ఆరోపించారు. ఆర్మీ మాజీ చీఫ్‌ ఎం.ఎం.నవరణె పుస్తకానికి సంబంధించి సభలో తాను లేవనెత్తిన ఇబ్బందికర అంశాలపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతోనే ప్రధాన నరేంద్ర మోదీ గత వారం లోక్‌సభకు డుమ్మా కొట్టారంటూ ఎద్దేవా చేశారు. విపక్షాల నుంచి ముప్పు కారణంగానే ఆయన రాలేదన్న స్పీకర్‌ ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు.

 ‘‘అది పచ్చి అబద్ధం. అది నిజమే అయితే ముప్పుందంటున్న వాళ్లు అందుకు బాధ్యుడైన వ్యక్తిపై తక్షణం ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు?’’అని ప్రశ్నించారు. సోమవారం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘నిండు సభలో మోదీపై దాడి చేసే ఆలోచనే కాంగ్రెస్‌ సభ్యులకు లేదు. ప్రజా సమస్యలతో పాటు అన్ని అంశాల మీదా అర్థవంతమైన చర్చ జరగాలనే విపక్షం కోరుకుంటోంది. సభకు వచ్చేందుకు మోదీకి దమ్ముండాలి. కానీ ఆయనకు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. సభలో అడుగు పెట్టగానే మేమెక్కడ నరవణె పుస్తకాన్ని తన చేతిలో పెడతామో అని మోదీ భయపడుతున్నారు. ప్రభుత్వం కూడా చర్చకు భయపడుతోందన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం’’అన్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)