Breaking News

బ్రిటన్‌ రాజు కానుకగా ఇచ్చిన మొక్క నాటిన ప్రధాని

Published on Sat, 09/20/2025 - 06:05

న్యూఢిల్లీ: బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 తనకు 75వ పుట్టిన రోజు సందర్భంగా కానుకగా పంపిన కదంబ మొక్కను శుక్రవారం ప్రధాని మోదీ అధికార నివాస ప్రాంగణంలో నాటారు. ‘తల్లి పేరుతో ఒక చెట్టు’ అన్న ప్రధాని మోదీ నినాదం ప్రేరణతోనే రాజు చార్లెస్‌ ఈ మొక్కను పంపారని ఢిల్లీలోని బ్రిటిష్‌ హై కమిషన్‌ కార్యాలయం తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలంటూ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ, చార్లెస్‌–3 కట్టుబడి ఉన్నారనేందుకు ఈ కానుకే ఒక ఉదాహరణ అని తెలిపింది.

 ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీ తన నివాస ప్రాంగణంలో మొక్కను నాటుతున్నప్పటి వీడియోను బ్రిటిష్‌ హై కమిషన్‌ కార్యాలయం శుక్రవారం ఆన్‌లైన్‌లో షేర్‌ చేసింది. ఇద్దరు నేతల మైత్రి, పర్యావరణ పరిరక్షణపై ఇద్దరి నిబద్ధతకు ఇది ప్రతీకని తెలిపింది. జూలైలో బ్రిటన్‌లో ప్రధాని మోదీ పర్యటన సమయంలో రాజు చార్లెస్‌–3 సొనొమా మొక్కను బహుమతిగా అందజేశారు. ‘కామన్వెల్త్, యూకే–భారత్‌ ఉమ్మడి భాగస్వామ్య విజన్‌–2035కు వాతావరణ, పరిశుభ్రమైన ఇంధన రంగాలే కీలకం’ అని బ్రిటిష్‌ హైకమిషన్‌ తెలిపింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)