Breaking News

పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ 

Published on Sat, 08/09/2025 - 06:00

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్‌తో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నట్లు పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తన మిత్రుడు పుతిన్‌తో చక్కటి, సమగ్రమైన సంభాషణ జరిగిందన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా ఇండియా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంతో పుతిన్‌తో మోదీ చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

పుతిన్‌తో మాటామంతీ అనంతరం మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ ఏడాది జరిగే 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సులో పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పా రు.

 భారత్‌–రష్యా ద్వైపాక్షిక ఎజెండా ప్రగతిని సమీక్షించామని వెల్లడించారు. ఉక్రెయిన్‌–రష్యా ఘర్షణ విషయంలో ఇండియా వైఖరి స్థిరంగా ఉన్నట్లు పుతిన్‌కు మోదీ తెలియజేశారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. శాంతి చర్చలు ప్రారంభించాలని, ఘర్షణకు సాధ్యమైనంత ముగింపు పలకాలని ఉక్రెయిన్, రష్యాలను ఇండియా కోరుతున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా సలహాదారు గురువారం రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ ఏడాది భారత్‌లో పర్యటించబోతున్నారని ఆయన నిర్ధారించారు.   
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)