Breaking News

అత్యాచార కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చింది?: ప్రధాని ఆరా

Published on Fri, 04/11/2025 - 16:36

వారణాసి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో సంచలన సృష్టించిన అత్యాచార ఘటనపై ఆరా తీశారు.  కొన్ని రోజుల క్రితం వారణాసిలో  19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీశారు.

ఆ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుల్ని అందరన్నీ అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీస్‌ కమిషనర్‌ ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు.  ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా ఆయనకు మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సిటీ పోలీస్‌ కమిషనర్‌, డివిజనల్‌ కమిషనర్‌, డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ లను  ప్రధాని మోదీ ప్రశ్నించారు. అత్యాచార ఘటన కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చిందని మోదీ అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే నిందితులకు ఏమైతే శిక్షలు ఉంటాయో అవి అమలయ్యేలా చూడాలన్న మోదీ.. భవిష్యత్‌ లో  ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమాధానమిచ్చిన పోలీస్‌ కమిషనర్‌.. కేసులో పురోగతి ఉందని స్పష్టం చేశారు. పలువుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు. 

కాగా,  ఓ యువతిని కిడ్నాప్‌ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసింది.. వీరిలో ఆరుగురిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.  అయితే కొన్నిరోజుల పాటు తిరిగి రాలేదు. దీనిపై ఏప్రిల్‌  4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే రోజు, పోలీసులు పాండేపూర్‌ వద్ద డ్రగ్స్‌ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు. అనంతరం ఆమెసొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్‌ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది.కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్‌ గంజ్, లాల్‌పూర్‌ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)