చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
ఐక్యరాజ్యసమితి ఇక మారాల్సిందే..: ప్రధాని మోదీ
Published on Thu, 10/22/2026 - 23:17
సాక్షి,న్యూఢిల్లీ: మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి (యూఎన్), ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా జరిగిన NDTV వరల్డ్ సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన.. ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో పాత అంతర్జాతీయ వ్యవస్థలు వెనుకబడుతున్నాయని పేర్కొన్నారు.
సాంకేతికత, వాణిజ్యం, కొత్త ఆర్థిక శక్తుల ఆవిర్భావంతో ప్రపంచ క్రమం వేగంగా మారుతోందని మోదీ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ శాంతి, సహకారం కోసం ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి గతంలో కీలక పాత్ర పోషించింది. కానీ నేటి సంక్లిష్ట సవాళ్లకు అనుగుణంగా మాత్రం మారాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
గ్లోబల్ సౌత్‌కు మరింత ప్రాతినిధ్యం
ప్రపంచం మారుతున్నప్పుడు నిర్ణయాలు తీసుకునే విధానాలు కూడా మారాలని మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాత్మక ప్రక్రియల్లో ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు సంక్షోభ సమయాల్లోనూ అంతర్జాతీయ సహకారం కొనసాగాలని మోదీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పాక్‌తో మంచి సంబంధాలే కోరుకుంటున్నాం.. కానీ.. జైశంకర్
Tags : 1