Breaking News

Operation Sindoor: పేరు పెట్టింది మోదీనే 

Published on Thu, 05/08/2025 - 02:46

న్యూఢిల్లీ: దేశమంతటా ఎక్కడ విన్నా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రతిధ్వనులే. అతికినట్టుగా సరిపోయిన ఆ పేరును స్వయంగా ప్రధాని మోదీయే సూచించారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని భార్యల ముందే వారిని కాల్చి చంపడం తెలిసిందే. వాళ్లలో లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ భార్య హిమాన్షికైతే కనీసం కాళ్ల పారాణి కూడా ఆరలేదు. 

పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లూ నిండిన భర్త మృతదేహం వద్ద ఆమె ఆక్రందన అందరినీ కలచివేసింది. ఉగ్రవాదులు అమాయక మహిళల నుదుటి సిందూరాన్ని తుడిపేసినందున ప్రతీకార చర్యకు ఆ పేరే బాగుంటుందని సూచించినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. దాడుల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఆ యన, ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించారు.   

కేబినెట్‌ అభినందనలు
ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం కీలక సమావేశాలు జరిగాయి. తొలుత కేంద్ర కేబినెట్, అనంతరం భద్రతా వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) భేటీ అయ్యాయి. ఆపరేషన్‌ సిందూర్‌ను ముక్త కంఠంతో అభినందిస్తూ కేబినెట్‌ తీర్మానం ఆమోదించింది. మన సైన్యం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. దాడులు జరిపిన తీరును కొనియాడారు. మరోవైపు కేంద్రం గురువారం ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)