Breaking News

నేడు బిహార్‌లో ప్రధాని పర్యటన 

Published on Mon, 09/15/2025 - 06:17

పట్నా: ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుర్నియాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రూ.36 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పుర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెరి్మనల్‌ను  ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేషనల్‌ మఖానా బోర్డును ప్రధాని ప్రారంభిస్తారు. మఖానాను సూపర్‌ఫుడ్‌గా పలుమార్లు ప్రధాని మోదీ పేర్కొనడం తెల్సిందే. దేశంలో ఉత్పత్తయ్యే మఖానాలో అత్యధికంగా 90 శాతం మేర బిహార్‌లో సాగవుతోంది. 

మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ బిహార్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 11 ఏళ్లలో బిహార్‌ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశారని బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర డెప్యూటీ సీఎం సమ్రాట్‌ చౌధరి తెలిపారు. తమ రాష్ట్రం డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఫలాలను అందుకుంటోందన్నారు. 

ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను అధికారులు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పుర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులపై ఒక వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కల్పనలో సీఎం నితీశ్‌ కుమార్‌ సారథ్యంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)