Breaking News

ఎంపీల కోసం కొత్తగా 184 నివాసాలు 

Published on Mon, 08/11/2025 - 06:01

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన కొత్త నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్‌ సింగ్‌ మార్గ్‌లో నిర్మించిన 184 టైప్‌–7 మల్టీ స్టోరీ ఫ్లాట్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎంపీల నివాస సముదాయంలో ప్రధాని మోదీ ‘సిందూర’మొక్కను నాటి, ఆ తర్వాత నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో ముచ్చటిస్తారు.

 అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగిచనున్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఎంపీల నూతన నివాస సముదాయం పార్లమెంట్‌ సభ్యుల అవసరాలకు తగిన అన్ని ఆధునిక సదుపాయాలతో ఉంటుంది. ప్రతి యూనిట్‌ విస్తీర్ణం సుమారు 5 వేల చదరపు అడుగులు కాగా, ఇందులో నివాసంతో పాటు అధికారిక పనులకు అనుకూలంగా గదులను కేటాయించారు.

 సిబ్బంది నివాసాలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్‌ వంటి సదుపాయాలు కల్పించారు. నివాస సముదాయంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. పర్యావరణ హిత సాంకేతికతతో నిర్మాణం చేపట్టి, గ్రీహా 3 స్టార్‌ రేటింగ్, నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌–2016 ప్రమాణాలను అనుసరించారు. 

దీంతో శక్తి పొదుపు, పునరుత్పత్తి ఇంధన వనరుల వినియోగం, వ్యర్థాల నిర్వహణలో మెరుగులు సాధ్యమవుతాయని అధికారులు పేర్కొన్నారు. అల్యూమినియం షట్టరింగ్‌ విధానంలో మోనోలితిక్‌ కాంక్రీట్‌ సాంకేతికతతో నిర్మాణం పూర్తి చేయడం వల్ల సమయానికి పనులు ముగిశాయని.. భూకంప నిరోధకంగా, దివ్యాంగులకు అనుకూలంగా ఈ భవనాలను రూపొందించారు. ప్రాజెక్ట్‌ కోసం భూమి పరిమితంగా ఉండటంతో అపార్ట్‌మెంట్‌ తరహా గృహ నిర్మాణం చేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌