సంవిధాన్‌.. సంఘ్‌ కా విధాన్‌ కాదు

Published on Sat, 12/14/2024 - 05:51

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్‌ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్‌ కా సంవిధాన్‌ సంఘ్‌ కా విధాన్‌ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్‌సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే...  

నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు   
‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్‌లాల్‌ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది.  

మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు  
గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్‌లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.

భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు  
దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్‌(గౌతమ్‌ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్‌ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు.
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)