Breaking News

ప్రపంచ విమానయాన హబ్‌గా భారత్‌: మోదీ

Published on Fri, 09/13/2024 - 05:06

న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. భారత్‌ను ప్రపంచ విమానయాన హబ్‌గా మార్చడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ప్రాంతీయ అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం ప్రజలందరికీ అందుబాటులోకి వస్తోందని అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి సైతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వెల్లడించారు. 

పౌర విమానయానంపై గురువారం ఢిల్లీలో జరిగిన రెండో ఆసియా–పసిఫిక్‌ మినిస్టీరియల్‌ సదస్సులో మోదీ మాట్లాడారు. 29 దేశాల నంచి 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రభుత్వం తీసుకొచి్చన ‘ఉడాన్‌’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, దీనిపై అధ్యయనం చేయాలని విదేశీ ప్రతినిధులకు మోదీ సూచించారు. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో విమానయాన రంగంలో నూతన అవకాశాలు సృష్టించేందుకు ప్రయతి్నంచాలని కోరారు. దాంతో ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, శాంతి, సౌభాగ్యానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉద్ఘాటించారు. 

ఇంటర్నేషనల్‌ బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ను వైమానిక రంగంతో అనుసంధానిస్తే వివిధ దేశాలకు, ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండడం, వారు సృష్టిస్తున్న డిమాండ్‌ విమానయాన రంగానికి చోదకశక్తిగా మారుతున్నాయని  మోదీ స్పష్టంచేశారు. భారత్‌లో విమానయాన సంస్థల నెట్‌వర్క్, సేవలు నానాటికీ విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఏవియేషన్‌ సెక్టార్‌లో ‘మహిళల సారథ్యంలో ప్రగతి’కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్‌లోని మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 5 శాతమేనని పేర్కొన్నారు.   
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)