Breaking News

భద్రతా వ్యవస్థపై  విస్తృత చర్చ

Published on Sun, 11/30/2025 - 05:53

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శనివారం అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. దేశ భద్రతా వ్యవస్థపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సదస్సు గోప్యంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. దేశ భద్రత విషయంలో అత్యుత్తమ విధానాలు, నూతన పద్ధతులను పంచుకోవడానికి పోలీసు అధికారుల సదస్సు ఒక ఉత్తమమైన వేదిక అని పేర్కొన్నారు.

 ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి రాయ్‌పూర్‌కి చేరుకున్నారు. శనివారం ఉదయం సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఐబీ చీఫ్‌ తపన్‌కుమార్‌ డేకా, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే డీజీపీలు, ఐజీపీల సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలో నక్సలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి సమస్యలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని ఆయన అన్నారు. ఆదివారం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)