Breaking News

‘ఎక్స్‌’లో మోదీ ఫాలోయర్లు 10 కోట్లు..!

Published on Mon, 07/15/2024 - 06:26

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయిని అధిగమించారు. ‘ఎక్స్‌’హ్యాండిల్‌లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. గత మూడేళ్లలో అదనంగా 3 కోట్ల మంది ఫాలోయర్లు నమోదవడంతో మోదీ ఈ ఘనత సాధించారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయనకు ఇప్పటికే పేరుంది. 

దేశంలో ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. క్రీడాకారుల్లో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి 6.41 కోట్ల మంది, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు నెయ్‌మార్‌కు 6.36 కోట్లు, అమెరికా బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు లెబ్రాన్‌ జేమ్స్‌కు 5.29 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ‘ఎక్స్‌’అధికారి ఒకరు వివరించారు. అమెరికాకు చెందిన సెలెబ్రిటీ టేలర్‌ స్విఫ్ట్‌కు 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 కోట్లు, కిమ్‌ కర్దాషియన్‌కు 7.52 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలిపారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)