Breaking News

యువశక్తికి రూ.62,000 కోట్ల బూస్ట్‌

Published on Sat, 10/04/2025 - 06:07

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యువత విద్య, నైపుణ్యా భివృద్ధి, వ్యవస్థాపకతకు ఊతం ఇచ్చే దిశగా రూ.62 వేల కోట్లకు పైగా విలువైన పలు యువత– కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. శనివారం ఉద యం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ‘కౌశల్‌ దీక్షాంత్‌ సమారోహ్‌’లో ఆయన పాల్గొంటారు. 

దేశ వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐ) నుంచి ఆల్‌ ఇండియా టాపర్లుగా నిలిచిన 46 మందిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు.ఈ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైనది ప్రధానమంత్రి స్కిల్లింగ్‌ అండ్‌ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడెడ్‌ ఐటీఐలు’ (పీఎం–సేతు). కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన దీనికోసం రూ.60 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. 

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ నమూనాలో ఆధునీకరించనున్నారు. ఇందులో 200 ఐటీఐలు ‘హబ్‌’లుగా, 800 ఐటీఐలు ‘స్పోక్‌’లుగా పనిచేస్తాయి. ప్రతి హబ్‌కు సగటున నాలుగు స్పోక్‌లు అనుసంధానమై ఉంటాయి. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాల యాలు, 200 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 1,200 వృత్తి నైపుణ్య ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు. 

మారుమూల, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు సైతం ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి 12 కీలక రంగాల్లో ప్రత్యక్ష శిక్షణ అందించడమే ఈ ల్యాబ్స్‌ లక్ష్యం. జాతీయ విద్యా విధానం–2020కి అనుగు ణంగా 1,200 మంది వృత్తి విద్యా ఉపాధ్యా యులకు శిక్షణ ఇచ్చారు. బిహార్‌కు సంబంధించిన పలు పథకాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)