Breaking News

స్వయం సమృద్ధ భారతే లక్ష్యం

Published on Fri, 06/06/2025 - 04:43

న్యూఢిల్లీ: దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. స్వయం సమృద్ధ, సమీకృత భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ప్రతి పౌరుడికీ లభించాలన్నదే తమ ఆశయమని వివరించారు. 

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ కాలం ఈ నెల 9వ తేదీ నాటికి 11 ఏళ్లు పూర్తి కానుంది. మూడో టర్మ్‌లో తొలి ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

‘‘పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల్‌ యోజన, జన్‌ధన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో ప్రజలకు పక్కా నివాస గృహాలు, వంట గ్యాస్, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)తో చివరి లబ్ధిదారుడికి సైతం మేలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. గత 11 ఏళ్లలో మా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజేస్తాం. నేరుగా వారి వద్దకే వెళ్తాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.  

మన భూగోళాన్ని కాపాడుకుందాం...  
మనం నివసిస్తున్న ఈ భూగోళాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నాలు మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. భూమిని రక్షించుకొనే విషయంలో అన్ని రకాల సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ దేశాలన్నీ స్వప్రయోజనాలు పక్కనపెట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కలపాలని సూచించారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడమే ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదమని గుర్తుచేశారు. ప్లాస్టిక్‌ కాలుష్య నివారణ కోసం తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ           స్పృహ క్రమంగా పెరుగుతోందని, లక్షలాది మంది నిత్య జీవితంలో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌’ విధానం పాటిస్తున్నారని చెప్పారు.  

సిందూర్‌ మొక్క నాటిన ప్రధాని 
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో సిందూర్‌ మొక్క నాటారు. బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడానికి 1971లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళలు ఆయనకు ఈ మొక్క బహూకరించారు. ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు గుర్తుగా మోదీ సిందూర్‌ మొక్కను స్వహస్తాలతో నాటారు.

 సిందూర్‌ మొక్క మన దేశ మహిళల శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సిందూర్‌ మొక్క నాటే గొప్ప అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల గుజరాత్‌లోని కచ్‌లో పర్యటించినప్పుడు మహిళలు తనకు ఈ మొక్కను బహూకరించారని, 1971లో పాకిస్తాన్‌పై భారత్‌ సాగించిన యుద్ధంలో వారంతా అసాధారణ పరాక్రమం, దేశభక్తిని ప్రదర్శించారని ప్రశంసించారు. సిందూర్‌ మొక్క నాటిన వీడియోలు, ఫొటోలను మోదీ షేర్‌ చేశారు.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)