Breaking News

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

Published on Fri, 07/03/2026 - 10:21

పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర 2026 అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాశారు. ఈ యాత్రను గొప్ప అదృష్టంగా అభివర్ణించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను కూడా పాటించాలని భక్తులకు ఆయన సూచించారు. ఈ మేరకు ఐదు సంకల్పాలను మోదీ సూచించారు.

ప్రధాని మోదీ లేఖలో ప్రధాన సందేశం
యాత్రికులకు రాసిన లేఖలో ప్రధాని మోదీ.. అమర్‌నాథ్ యాత్రను భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆయన ఈ యాత్రను భక్తి, ఏకత్వం మరియు శ్రద్ధకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ సమయంలో యాత్రికులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలుగా ఆయన ఐదు సంకల్పాలుగా సూచించారు.

ఐదు సంకల్పాలు ఇవే..

  • యాత్ర మార్గాల్లో పరిశుభ్రతను కాపాడటం

  • భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలను పాటించడం

  • స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం (“Vocal for Local”)

  • యాత్ర అనంతరం ఒక మొక్క నాటడం (“Ek Ped Maa Ke Naam”)

  • దేశాభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించడం (“Nation First” భావన)

ఇక, ఈ ఏడాది యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగనుంది. హిమాలయాల్లో 12,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. యాత్ర ప్రారంభానికి ముందు జమ్మూ నుంచి మొదటి భక్తుల బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా భక్తులు “హర్ హర్ మహాదేవ్”, “బమ్ బమ్ భోలే” అంటూ భక్తి నినాదాలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర బలగాలు, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు కలిసి బలమైన మల్టీ-లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీలు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలు ఉపయోగించి యాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)