Breaking News

నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

Published on Mon, 02/19/2024 - 06:43

ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో  నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. 10:30 గంటలకు కల్కి ధామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. 

ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ప్రమోద్ కృష్ణం తెలిపారు. కల్కిధామ్ వేడుకలకు ప్రధాని హాజరు కానున్నారని తెలియగానే ఆచార్య ప్రమోద్ కృష్ణంను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. కాంగ్రెస్‌ సభ్యుడు ఆచార్య ప్రమోద్‌ కృష్ణం ఫిబ్రవరి ఒకటిన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి కల్కిధామ్‌ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై ప్రధాని సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఈ నేపధ్యంలోనే  ప్రమోద్ కృష్ణంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్‌ ఒక లేఖలో తెలియజేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)