Breaking News

పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను వీక్షించనున్న మోదీ

Published on Mon, 12/02/2024 - 12:59

న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా హిందీ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్‌’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు(సోమవారం) వీక్షించనున్నారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూడనున్నారు. మోదీతో పాటు విక్రాంత్‌ మాస్సే, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ కూడా చిత్రాన్ని వీక్షించనున్నారు.

ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా రూపొందించిన ది సబర్మతి రిపోర్ట్‌’లో నటులు విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశి ఖన్నా ప్రధాన పాత్రాలుగా నటించారు. బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్‌​ సర్నా తెరకెక్కించగా.. ఏక్తా కపూర​ నిర్మించారు. నవంబర్‌ 15న ఈ సినిమా విడుదలైంది.

కాగా పంచమహల్‌ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)