Breaking News

‘గత జన్మలో ప్రధాని మోదీ.. ఛత్రపతి శివాజీ’

Published on Tue, 03/18/2025 - 13:57

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj), మొఘల్ పాలకుడు ఔరంగజేబు అంశంపై వివాదాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో బీజేపీ ఎంపీ ఒకరు దీనికి ఆజ్యం పోసేలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని బార్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎంపి ప్రదీప్ పురోహిత్ పార్లమెంటులో మాట్లాడుతూ ప్రధాని మోదీ  గత జన్మలో మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని  అభివర్ణించారు. ఎంపీ చేసిన ఈ ప్రకటన  కలకలం సృష్టించింది.

ఎంపీ ప్రదీప్ పురోహిత్ లోక్ సభ(Lok Sabha)లో మాట్లాడుతూ తాను ఇటీవల ఒక సాధువును కలిశానని, ఆయన గత జన్మలో ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ మహారాష్ట్రతో సహా మొత్తం దేశాన్నంతటినీ పురోగతి వైపు తీసుకెళ్లడానికి పునర్జన్మ తీసుకున్నారని ప్రదీప్ పురోహిత్  పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యానంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే, దానిని సభా కార్యకలాపాల నుండి తొలగించినట్లుగా పరిగణించాలని కోరారు. కాగా ప్రదీప్ పురోహిత్ ప్రకటనపై విచారణ చేయాలని, ఆయనను సభా కార్యకలాపాల నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించాలని స్పీకర్ దిలీప్ సైకియా ఆదేశించారు.
 

కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్.. ప్రదీప్ పురోహిత్ ప్రకటనను విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్ట్ చేశారు.. ‘ఇలాంటివారు నరేంద్ర మోదీ తలపై ఛత్రపతి శివాజీ మహారాజ్ కిరీటాన్ని ఉంచడం ద్వారా.. శివాజీ మహారాజ్‌ను తీవ్రంగా అవమానించారన్నారు. అవిభక్త భారతదేశ పూజ్య దైవం, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను పదే పదే అవమానించడానికి ప్రయత్నిస్తూ, శివాజీ మహరాజ్‌ గుర్తింపును దెబ్బతీసేందుకు బీజేపీ నాయకత్వం  ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: మహాకుంభమేళాలో ఐక్యత అనే అమృతం ఉద్భవించింది: ప్రధాని మోదీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)