Breaking News

ముష్కరులకు శిక్ష తప్పదు

Published on Wed, 11/12/2025 - 14:39

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడి, సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులను కచ్చితంగా శిక్షించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 

ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టడం తథ్యమని తేల్చిచెప్పారు. పేలుడులో గాయపడి ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోదీ బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

భూటాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న మోదీ నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి వచ్చారు. దాదాపు 25 నిమిషాలపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. అధికారులతో, డాక్టర్లతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కారు బాంబు పేలుడు పట్ల మోదీ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దర్యాప్తు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నానని మంగళవారం వెల్లడించారు.  

Videos

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)