Breaking News

అదంపూర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో ముచ్చట

Published on Tue, 05/13/2025 - 12:32

పంజాబ్‌: అదంపూర్‌ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బందితో ప్రధాని భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ఎయిర్‌ఫోర్స్‌ కీలక పాత్రపై మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. పాక్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ప్రధాని తొలిసారిగా నిన్న (సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పంజాబ్‌లో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు మోదీ నిన్న(సోమవారం) తన ప్రసంగంలో ప్రకటించారు. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుందన్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది.

..పాక్‌ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్‌ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్‌ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి’’ అని ప్రధాని అన్నారు.

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)