వన్యప్రాణుల వైవిధ్యానికి ఊతం

Published on Mon, 02/20/2023 - 03:59

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల రాకతో మన దేశంలో వన్యప్రాణుల వైవిధ్యానికి మరింత ఊతం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చీతాల రాకపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ చేసిన ట్వీట్‌ను మోదీ ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాలో ట్యాగ్‌ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ప్రాజెక్టు చీతా’ మరో మైలురాయికి చేరుకుందని భూపేంద్ర యాదవ్‌ తన ట్వీట్‌లో వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో రప్పించిన 12 చీతాలను శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.  

లద్ధాఖ్‌లో జీవనం మరింత సులభతరం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో ప్రజల జీవనాన్ని మరింత సులభతరంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 4.1 కిలోమీటర్ల పొడవైన షిన్‌కున్‌ లా సొరంగం నిర్మాణానికి రూ.1,681.51 కోట్లు కేటాయించడానికి కేంద్రం అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ లద్ధాఖ్‌ ఎంపీ జామ్‌యాంగ్‌ సెరింగ్‌ చేసిన ట్వీట్‌ను మోదీ ట్యాగ్‌ చేశారు.  

ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం
మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజలకు అందించిన సుపరిపాలన మనకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులరి్పంచారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)