Breaking News

గుజరాత్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు ’వంతారా’ సందర్శన

Published on Sun, 03/02/2025 - 07:02

జామ్‌నగర్‌: మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గుజరాత్‌ చేరుకున్నారు. శనివారం రాత్రి జామ్‌నగర్‌ సర్క్యూట్ హౌస్‌లో బస చేసిన  ఆయన నేడు (ఆదివారం) రిలయన్స్ ఫౌండేషన్ జంతు రక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించనున్నారు.  ప్రధాని తన పర్యటనలో భాగంగా గిర్ జిల్లాలోని ససన్ గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి, జంగిల్ సఫారీ చేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీ సోమనాథ్ మహాదేవ్ ఆలయంలో  పూజలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనపై గుజరాత్ మంత్రి ములుభాయ్ బేరా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని రాకకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తి చేశామని, ఆయన జామ్‌నగర్, ద్వారక, గిర్ జిల్లాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు.

జంతు సంరక్షణ కేంద్రం సందర్శన
ఈ రోజు(ఆదివారం) సాయంత్రం ప్రధాని మోదీ జామ్‌నగర్‌(Jamnagar)లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. తరువాత ఆయన ససాన్ చేరుకుంటారు. అక్కడి అటవీ శాఖ కార్యాలయ అతిథి గృహం ‘సింగ్ సదన్’ను సందర్శిస్తారు. అలాగే ఈరోజు జరిగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

జంగిల్ సఫారీ..
మార్చి 3న ప్రధాని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీలో పాల్గొంటారు. అక్కడి నుండి సింగ్ సదన్‌కు  చేరుకుని ఎన్‌బీడబ్ల్యు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వన్యప్రాణులకు సంబంధించిన జాతీయ స్థాయి అంశాలపై చర్చించనున్నారు.

సోమనాథ్ ఆలయంలో పూజలు 
అదే రోజున ప్రధాని ససాన్‌లో అటవీశాఖ సిబ్బందితో సంభాషించనున్నారు. తరువాత సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.

ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్‌ రాకకు సమయం ఆసన్నం

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)