Breaking News

ప్రపంచ ఆహార భద్రతకు భారత్‌ కృషి: ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ

Published on Sat, 08/03/2024 - 15:46

సాక్షి, ఢిల్లీ: ప్రపంచ ఆహార భద్రతకు భారత్‌ కృషి చేస్తోందని.. మన దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో 75 దేశాల ప్రతినిధులు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చహౌన్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యవసాయమే కేంద్రం అని మిల్లెట్‌లు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్‌ అగ్రస్థానంలో ఉందన్నారు.

2024-25 కేంద్ర బడ్జెట్‌లో సుస్థిర వ్యవసాయంపై పెద్దఎత్తున దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. గత పదేళ్లలో ప్రభుత్వం కొత్త వాతావరణాన్ని తట్టుకోగల వెయ్యి 900 రకాల పంటలను అందించిందని చెప్పారు. భారతదేశం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఒక్క క్లిక్‌తో పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేస్తున్నామని ప్రధాని వివరించారు.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)