Breaking News

ప్రధాని మోదీ శశాంకాసనం.. ప్రయోజనాలివే

Published on Thu, 06/20/2024 - 09:47

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న  ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని మోదీ ఈసారి కూడా  తన యోగాసనాల ఏఐ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దానిలో శశాంకాసనం వేసే విధానాన్ని వివరించారు.

ఈ వీడియోను సంస్కృత భాషలో రూపొందించారు. శశాంకాసనం వేసేటప్పుడు శరీరం కుందేలు మాదిరి పొజీషన్‌లోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో వీడియోలో చూపించారు. ఈ ఆసనం వేయడానికి ముందుగా వ్రజాసన భంగిమలో కూర్చోవాలి. మోకాళ్లపై చేతులను ఉంచాలి. ఇప్పుడు రెండు మోకాళ్లను వీలైనంత వరకు సౌకర్యవంతమైన భంగిమలో విస్తరించాలి. అరచేతులను మోకాళ్ల మధ్య ఉంచాలి. వాటిని ముందుకు చాస్తూ, శరీరాన్ని కిందకు వంచాలి. అప్పుడు చేతులు సమాంతరంగా ముందుకు చాచాలి. అదే పొజీషన్‌లో ముందుకు చూస్తూ కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత వ్రజాసన భంగిమకు రావాలి.

మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే కోపం అదుపులోకి వస్తుంది. వెన్ను నొప్పి నుంచి కూడా  ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. హైబీపీ ఉన్నవారు ఈ ఆసనం వేసే విషయమై వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు