Breaking News

బ్రిక్స్ సమ్మిట్: రష్యాకు బయలుదేరిన ప్రధాని మోదీ

Published on Tue, 10/22/2024 - 07:51

న్యూఢిల్లీ: రష్యాలో నేడు, రేపు(అక్టోబర్ 22, 23) జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని కజాన్ నగరానికి తరలివెళ్లారు. రష్యాలో ప్రధాని మోదీ పర్యటన రెండు రోజులపాటు సాగనుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
 

16వ బ్రిక్స్ సదస్సు  ‘సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి- భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం’ అనే అంశంపై జరగనుంది. కాగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్టోబరు 22న సమ్మిట్ ప్రారంభం కానున్నదని, తొలిరోజు సాయంత్రం నేతలకు విందు ఉంటుందన్నారు. బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో 23న ఉదయం క్లోజ్డ్ ప్లీనరీ, మధ్యాహ్నం ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుంది.

బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్, చైనాల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే దిశగా ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయిలో కసరత్తుల తర్వాత, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)పై పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఒప్పందం కుదిరింది.

ఇదిలా ఉండగా ప్రధాని మోదీ పర్యటనకు ముందు కజాన్‌లోని భారత కమ్యూనిటీకి చెందినవారు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న దృశ్యాలు వెలికివచ్చాయి. బ్రిక్స్ గ్రూపులో 2010 నుండి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. తాజాగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఎఈ) దీనిలో చేరాయి.

ఇది కూడా చదవండి: పాక్‌ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు