Breaking News

స్పెయిన్‌ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్‌ షో

Published on Mon, 10/28/2024 - 11:05

వడోదర: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం గుజరాత్‌లోని వడోదర నగరానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌లు వడోదర నగరంలో ఓపెన్ జీపులో రోడ్‌షో నిర్వహించి, రోడ్డు పక్కన నిలుచున్న ప్రజలకు అభివాదం చేశారు.

వడోదర విమానాశ్రయం నుంచి నగరంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు 2.5 కి.మీ పొడవునా ఈ  రోడ్‌ షో కొనసాగింది. అనంతరం ఇద్దరు ప్రధానులు టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. మోదీ శాంచెజ్‌లు 'టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్' సెంటర్‌కి వెళ్లినప్పుడు కళాకారులు వారికి ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశం కోసం లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు వెళ్లే ముందు ఇద్దరు నేతలు సంయుక్తంగా 'టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్' కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌ను సి-295 విమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్మించింది. వడోదరలోని ఈ కాంప్లెక్స్‌లో 40 విమానాలను తయారు చేయనున్నారు.
 

భారతదేశంలో ఈ 40 విమానాలను తయారు చేసే బాధ్యత టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు అప్పగించారు. ఈ కాంప్లెక్స్ భారతదేశంలో సైనిక విమానాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్. ఇందులో విమానాల తయారీ, వాటి భాగాలను అసెంబ్లింగ్ చేయడం,  వాటిని పరీక్షించడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా విమానాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. కాగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శించిన అనంతరం మోదీ అమ్రేలీకి వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2:45 గంటలకు దుధాలలో భారత్ మాతా సరోవరాన్ని ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: మల్టీ-అసెట్‌ ఫండ్స్‌తో దీపావళి కాంతులు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)