Breaking News

Bangladesh: తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

Published on Sun, 02/15/2026 - 07:28

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఈ నెల 17వ తేదీన ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్‌ రెహ్మాన్‌ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ఈ వేడుకను అంతర్జాతీయ వేదికగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ సహా మొత్తం 13 దేశాల ప్రభుత్వాధినేతలకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేక దౌత్య సంబంధాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందిన ఆహ్వానం  ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫిబ్రవరి 17న ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బంగ్లాదేశ్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ పార్టీ అధికారికంగా మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్‌లోని సదరన్ ప్లాజాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అదే రోజు ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేయనుండగా, అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్.. తారిఖ్ రెహమాన్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

దక్షిణాసియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ తదితర పొరుగు దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కాగా బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ, భారత్‌తో ఆ దేశ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బీఎన్‌పీ హయాంలో భారత్‌తో సంబంధాలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వంపై సానుకూల ప్రకటనలు చేసింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)