ఎమర్జెన్సీ.. ఒక చీకటి యుగం

Published on Mon, 06/19/2023 - 05:29

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.1975 జూన్‌ 25న అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రజాస్వామ్యవా దుల్ని అత్యంత క్రూరంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాల వల్ల దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రమాదంలో పడతాయని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు.

‘మన దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమం. ప్రజాస్వామ్య విలువలున్న ఈ దేశంలో జూన్‌ 25ని ఎప్పటికీ మర్చిపోలేము. అది దేశ చరిత్రలో ఒక చీకటి యుగం’’ అని ప్రధాని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమర్జెన్సీపై రాసిన టార్చర్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ ఇన్‌ ఇండియా అనే పుస్తకం గురించి తెలుసుకున్నానని తెలిపారు. అందులో ఎన్నో కేస్‌ స్టడీల్లో ఇందిర ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందో తెలుస్తుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరగాల్సిన మన్‌కీ బాత్‌  ప్రధాని అమెరికా పర్యటనతో ముందే ప్రసారమైంది.

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రతీ ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ రోజూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం రోజు యూఎన్‌ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చిందని  ప్రధాని చెప్పారు. తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి మనం చేరుకున్నామని ప్రధాని చెప్పారు. గుజరాత్‌లో బిపర్‌జోయ్‌ తుపాన్‌ బీభత్సం నుంచి కచ్‌ ప్రజలు వేగంగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)