Breaking News

భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

Published on Fri, 05/03/2024 - 13:20

ఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, రాయ్‌ బరేలీ పోటీ నిర్ణయంపై బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. వయనాడ్‌లో ఓడిపోతాడని తెలిసే రాహుల్‌ రాయ్‌బరేలీకి పారిపోయారన్నారు. 

ఇవాళ ఆయనకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. భయం వద్దు(డరో మత్‌).. పారిపోవద్దు(భాగో మత్‌).. అంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. (బీజేపీ దర్యాప్తు  సంస్థలను  ప్రయోగిస్తుందని ఆరోపించే క్రమంలో తరచూ ‘భయం వద్దు డరో మత్‌’ అంటూ  రాహుల్‌ గాంధీ చెబుతుంటారు).

‘‘వాళ్ల అగ్రనేత  పోటీకి భయపడతాడని నేను ముందే చెప్పా. ఆయన మాత్రమే కాదు.. ఆమె (సోనియా గాంధీ) కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. అందుకే ఆమె రాజ్యసభ వంకతో రాజస్థాన్‌ పారిపోయారు. ఇదే జరిగింది. ఇంతలా భయపడే  వీళ్లు దేశమంతా తిరుగుతూ ప్రజల్ని భయపడొద్దని చెబుతున్నారు.

వయనాడ్‌లో ఆయన ఓడిపోతారని నేను చెప్పా. ఆయన  తన ఓటమిని గానే గుర్తించారు. అందుకే ఇప్పుడు మరో చోట పోటీ చేస్తున్నారు. నేను చెబుతున్నా.. భయపడకు, పారిపోకు’’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు. 

రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలంతా  స్పందిస్తున్నారు   . అమేథీలో ఏం చేయని వారు.. రాయ్‌ బరేలీలో ఏం చేస్తారు? అని బీజేపీ అమేథీ అభ్యర్థి స్మృతి ఇరానీ నిలదీశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమేథీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అది చూసే సోనియా కుటుంబం పోటీ చేయకుండా పారిపోయింది. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)