Breaking News

జపాన్‌ పీఎం దంపతులకు  మోదీ కానుకలు 

Published on Sun, 08/31/2025 - 05:03

న్యూఢిల్లీ: జపాన్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్‌ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాకు గౌరవప్రదంగా కొన్ని విలువైన కానుకలు బహూకరించారు. షిగేరు సతీమణికి సైతం మోదీ కానుక అందజేశారు. కశ్మీర్‌లో లభించే చేతితో అల్లిన అత్యంత నాణ్యమైన పశ్మీనా ఉన్ని శాలువను షిగేరు సతీమణి యోషికోకు బహూకరించారు. లద్దాఖ్‌లోని ఛాంగ్‌థంగీ జాతి మేక ఉన్నితో ఈ పశ్మీనా శాలువను తయారుచేశారు. 

ఈ శాలువ అత్యంత తేలికగా, మృదువుగా, వెచ్చగా ఉంటుంది. గతంలో కశ్మీరీ రాజుల కాలంలో ఈ పశ్మీనా ఉన్ని దుస్తులను ఎంతగానో ఇష్టపడేవారు. అదే సంస్కృతిని కశ్మీరీలు పరంపరగా కొనసాగిస్తూ హస్తకళను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. శ్వేతవర్ణ అంచుతో, ఎరుపు, గులాబి రంగుల మేళవింపుతో అందంగా ఈ శాలువాను తయారుచేశారు. కాగితపు గుజ్జు, జగురు ఇతర సామగ్రితో అందంగా రూపొందించిన చిన్న పెట్టెలో పెట్టి ఈ శాలువాను ఆమెకు అందజేశారు. 

ఈ చిన్న పెట్టె మీద సైతం పుష్పాలు, పక్షుల చిత్రాలను అందంగా పెయింటింగ్‌ వేశారు. జపాన్‌ ఆహార అలవాట్లకు అనువుగా.. ఆంధ్రప్రదేశ్‌లో దొరికే అరుదైన గోధుమరంగు మూన్‌స్టోన్‌ రాయితో చేసిన రామెన్‌ గిన్నెను జపాన్‌ ప్రధానికి మోదీ బహూకరించారు. ఈ రామెన్‌ బౌల్‌ను పెట్టేందుకు రాజస్తానీ పార్చిన్‌కారి శైలిలో శ్వేతవర్ణ మక్రానా పాలరాయితో ఒక బేస్‌ను తయారుచేశారు. ఈ బేస్‌పై అరుదైన చిన్న రాళ్లను పొదిగారు.

 ఈ బౌల్‌లో ఆహారాన్ని జపాన్‌ శైలిలో తినేందుకు రెండు చాప్‌స్టిక్‌లను తయారుచేశారు. వాటి కొనలను వెండితో రూపొందించారు. పెద్ద బౌల్‌కు తోడుగా నాలుగు చిన్న బౌల్‌లను అందజేశారు. జపాన్‌లోని డోంబురీ, సోబా సంప్రదాయాల్లో ఇలా ఒక పెద్ద గిన్నె, నాలుగు చిన్న గిన్నెలను వాడతారు. మూన్‌స్టోన్‌ రాయి ప్రేమ, సమతుల్యత, రక్షణలను సూచిస్తుంది.   
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)