Breaking News

సీజేఐ ఇంట్లో ప్రధాని మోదీ గణపతి పూజపై రాజకీయ దుమారం

Published on Thu, 09/12/2024 - 14:58

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

దేశంలో గణేష్‌ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో గణేజ్‌ పూజ జరిగింది. ఈ పూజలో మోదీ సంప్రదాయ మహరాష్ట్ర టోపీ ధరించి పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న ఫొటోల్ని ప్రధాని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అయితే మోదీ పూజలో పాల్గొన్నడానికి ప్రతిపక్ష నేతలు తప్పుబడుతుంటే .. అధికార బీజేపీ నేతలు పూజలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు పాల్గొనడం నేరం కాదని మోదీకి మద్దతు పలుకుతున్నారు.  

ప్రజల్లో సందేహాలు తలెత్తుతాయ్‌
రాజ్యసభ ఎంపీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇలాంటి (మోదీ పూజలో పాల్గొనడంపై) సమావేశాలు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. ఇది గణపతి పండుగ. ఢిల్లీలో చాలా చోట్ల గణేష్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి.  ప్రధాని ఇప్పటి వరకు ఎంత మంది ఇళ్లకు వెళ్లారో నాకు సమాచారం లేదు. కానీ ప్రధాని మాత్రం చీఫ్‌ జస్టిస్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ గణపతి పూజలు చేశారు. హారతులిచ్చారు. రాజ్యాంగ పరిరక్షకులు.. రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తుంటే  ప్రజలకు సందేహాలు కలుగుతాయి’అని సంజయ్‌ రౌత్ అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చంద్రచూడ్‌కు ఉన్న సంబంధాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. శివసేన (యూబీటీ) ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య జరిగిన గొడవకు సంబంధించిన కేసు విచారణ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ తప్పుకోవాలని కోరారు.

ఇదీ చదవండి : అన్నదమ్ముల్ని ప్రాణం తీసిన అప్పు

అది తప్పెలా అవుతుంది
ప్రధాని పర్యటనపై ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. గణేష్ పూజకు హాజరు కావడం నేరం కాదు. అనేక సందర్భాల్లో న్యాయమూర్తలు, రాజకీయ నాయకులు  పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు. అది తప్పు కాదు కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారని గుర్తు చేశారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)