Breaking News

లక్ష గళ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతం

Published on Fri, 11/28/2025 - 12:46

ఉడుపి, సాక్షి,  : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో లక్ష  కంఠ గీత పారాయణ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు.

కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పవిత్ర కనక కవచం (బంగారు కవచం )ను  అందించారు. ఇది పవిత్ర కనకదాసు శ్రీ కృష్ణుడి దర్శనం పొందిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో, విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన పౌరులు సహా దాదాపు 1,00,000 మంది పాల్గొనే ఈ పవిత్ర భగవద్గీత లక్ష కంఠ పారాయణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని 800 సంవత్సరాల క్రితం ద్వైత వేదాంత తత్వశాస్త్ర స్థాపకుడు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు. త్రివర్ణ పతాకాలతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనారు.

ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ గోవాకు వెళతారు. అక్కడ శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి జీవోత్తం మఠం 550వ వార్షికోత్సవాల్లో  పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం దక్షిణ గోవాలోని  పత్రాగౌలిలో 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.  రామాయణ థీమ్ పార్క్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక పోస్టల్ స్టాంపు , నాణెంను విడుదల చేయనున్నారు.
 

 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)