Breaking News

మోదీజీకి స్పెషల్‌ రాఖీ.. పాక్‌ ముస్లిం సోదరి రాఖీ ఇదే..

Published on Wed, 08/06/2025 - 08:04

ఢిల్లీ: అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా దేశవ్యాప్తంగా రక్షబంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా రాఖీ పండుగ కోసం ప్రజలు సిద్దమవుతున్నారు. కాగా, రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఏడాది కూడా రాఖీ కట్టేందుకు ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ ప్రత్యేక రాఖీని తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఆనందం వ్యక్తం చేశారు.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని కరాచీలో 1981లో జన్మించిన ఖమర్ షేక్.. గుజరాత్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో భారత్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత 30 సంవత్సరాలుగా తాను మోదీజీకి రాఖీ కడుతున్నట్టు తెలిపారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా రాఖీ పంపిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం ఆమె తన చేతులతో ఓం, గణేష్ జీ డిజైన్లతో నాలుగు రాఖీలను తయారు చేసింది. రాఖీ కట్టేందుకు ఆమె పీఎంఓ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్బంగా  ఖమర్ మొహ్సిన్ షేక్ మాట్లాడుతూ..‘ప్రతి సంవత్సరం తాను స్వయంగా రాఖీలు తయారు చేస్తానని, తనకు అత్యంత ఇష్టమైన రాఖీని ప్రధాని మోదీ చేతికి కడతానని చెప్పారు. మోదీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని ఆమె చెప్పింది. ఒకసారి ప్రధాని మోదీ తన క్షేమం గురించి అడిగి, ‘సోదరి ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ప్రార్థించినట్టు షేక్ చెప్పారు. అప్పుడు ఆయన నవ్వినట్టు తెలిపింది. అయితే, గత సంవత్సరం తాను ఢిల్లీకి వెళ్లలేకపోయానని, కానీ ఈ సంవత్సరం తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వస్తుందని, రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన భర్తతో కలిసి మోదీని కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)