Breaking News

నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన

Published on Sat, 02/03/2024 - 06:49

ప్రధాని నరేంద్ర మోదీ నేడు(శనివారం) ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. 

ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం ఝార్సుగూడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్‌పూర్ వెళతారు.  

జగదీష్‌పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్‌)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద రూ.2,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది. 

అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 2,660 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడనుంది. అలాగే దాదాపు రూ. 28,980 కోట్ల విలువైన ప‌లు విద్యుత్ ప్రాజెక్టుల‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)