Breaking News

బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ

Published on Sun, 09/22/2024 - 07:54

న్యూయార్క్‌: నాలుగో క్వాడ్ సమ్మిట్‌ సమావేశం ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాన మంత్రి మోదీ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించారు. ప్రెసిడెంట్‌ జో బైడెన్‌తో జరిగిన ఈ భేటీపై ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. బైడెన్‌తో తాను జరిపిన చర్చలు చాలా ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు.

‘‘డెలావేర్‌ గ్రీన్‌విల్లేలోని తన నివాసంలో నాకు ఆతిథ్యమిచ్చినందుకు ప్రెసిడెంట్ జో బిడెన్‌కి ధన్యవాదాలు. మా చర్చలు ఫలవంతమయ్యాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించడానికి మాకు అవకాశం లభించింది’’ అని పేర్కొన్నారు.

 

ప్రధాని మోదీ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. తమ సమావేశానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ. తనను కలిసిన ప్రతిసారీ ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను కనుగొనడంలో ప్రధాని మోదీ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.

‘‘భారతదేశంతో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడైనా లేనంత బలమైంది. ఈ బంధం చాలా సన్నిహితమైంది, చైతన్యవంతమైనది. ప్రధాని మోదీ, నేను భేటీ అయిన ప్రతిసారీ ఓ కొత్త సహకార రంగాలను కనుగొనడంలో మా సామర్థ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నా. ఈ రోజు  సమావేశంలో అదే జరిగింది’’ఎక్స్‌లో పేర్కొన్నారు.

మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఫిలడెల్ఫియాలో ఘన స్వాగతం లభించింది. ప్రెసిడెంట్ బిడెన్ తన ఇంటికి పీఎం మోదీని స్వాగతించారు. చేయి పట్టుకుని మరీ మోదీని తన నివాసంలోకి బైడెన్‌ తీసుకెళ్లారు.

క్వాడ్​ ఎవరికీ వ్యతిరేకం కాదు!
క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో విల్మింగ్‌టన్‌లో ఈ సమావేశం జరుగుతోందని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్‌తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. 2021లో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును ప్రధాని గుర్తు చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని పేర్కొన్నారు. 2025లో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం ఎంతో సంతోషకరంగా ఉందని మోదీ చెప్పారు.

ఘన స్వాగతం
అమెరికా పర్యటనలో భాగంగా తొలుత ఫిలాడెల్ఫియా విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం దక్కింది. విమానాశ్రయం వెలుపల ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సంభాషించారు. తరువాత డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లోని హోటల్ డుపాంట్‌లోనూ ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడారు. అక్కడ ప్రదర్శించిన 'గర్బా'ను ప్రధాని వీక్షించారు. ఇవాళ న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేస్తున్న 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు.

చదవండి: మోదీ-బైడెన్‌ ద్వైపాక్షిక చర్చలు.. కుదిరిన డ్రోన్‌ డీల్‌

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)