Breaking News

కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ.. 45 గంటలు ధ్యానంలోనే..

Published on Thu, 05/30/2024 - 20:51

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ వివేకానంద రాక్‌ మెమోరియల్‌లో 45 గంటలపాటు సుదీర్ఘ ధ్యానం చేయనున్నారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు మోదీ. ధోతీ తెల్లటి శాలువ ధరించిన ప్రధాని.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు, మోదీకి పూజారులు ప్రత్యేక హారతి అందించారు. అలాగే ఓ శాలువ, అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని ప్రధానికి అందించారు.

నేటి సాయంత్రంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పూర్తిగా ముసిగింది. ర్యాలీలు పర్యటనలు, బహిరంగ సభలతో బిజీ బిజీగా గడిపిన ప్రధాని  మోదీ కాస్త విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు పూర్తిగా ధ్యానంలో మునిగిపోనున్నారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు దాదాపు 45 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. కాగా ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడం ఇదేం తొలిసారి కాదు.  2019లో కేదార్‌నాథ్‌ను, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు.

ప్రత్యేకత ఇదే..
అయితే ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 132 ఏళ్ల క్రితం 1892 లో స్వామి వివేకానంద.. ఈ వివేకానంద రాక్ మెమొరియల్ ఉన్న ప్రాంతంలో ధ్యానం చేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌ను నిర్మించారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు కన్యాకుమారిలో ఉండనుండటంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 వ తేదీ వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు. ఈ క్రమంలోనే భారత తీర రక్షక దళం, భారత నావికాదళం గట్టి నిఘా ఉంచాలని కోరింది.

ఇదిలా ఉండగా ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా.. జూన్‌ ఒకటిన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ భావిస్తోంది.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)