Breaking News

Pariksha Pe Charcha:‘తల్లిని చూసి నేర్చుకోండి.. లైఫ్‌లో షార్ట్‌ కట్స్‌ వద్దు’

Published on Fri, 01/27/2023 - 13:14

PM Narendra Modi Pariksha Pe Charcha.. విద్యార్థులకు ఇది పరీక్షా సమయం.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పరీక్షా పే చర్య కార్యక్రమంలో పాల్గొని వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్‌, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ క్రమంలో వారితో ముచ్చటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 

కాగా, ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్‌ స్టేడియం పరీక్షా పే చర్చకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమయపాలన గురించి కీలకంగా చర్చించారు.  ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ.  రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలని సూచించారు.  ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా ప్రధాని మోదీని పలు ప్రశ్నలు అడిగారు. 

మోదీజీ.. హార్డ్‌ వర్క్‌ లేక స్మార్ట్‌ వర్క్‌..
పరీక్షా పే చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చర్చ మధ్యలో ఓ విద్యార్థి ప్రధాని మోదీని.. స్మార్ట్‌ వర్క్‌ లేక హార్డ్ వర్క్‌ ఏదీ ముఖ్యమైంది ప్రధాని సార్‌ అంటూ ప్రశ్నించాడు. దీనికి ప్రధాని సమాధానం ఇస్తూ.. ‘కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు’ అన్ని అన్నారు. కొంత మంది విద్యార్థులు వారి క్రియేటివిటిని పరీక్షల్లో చీటింగ్​ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆ క్రియేటివిటి మంచి మార్గానికి వాడుకుంటే మంచి విజయాన్ని అందుకుంటారని తెలిపారు. మనం జీవితంలో ఎన్నడూ షార్ట్‌కట్స్‌ వెతుక్కోకూడదు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని  కోరారు. 

ఇదే సమయంలో చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారన్నారని చెప్పారు. ప్రశాంతమైన మనసుతో పిల్లలు పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇక.. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు.  కాగా, ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సుమారు 38.80 లక్షల మంది పాల్గొన్నారు. 
- విద్యార్థులు- 31.24 లక్షలు, 
- ఉపాధ్యాయులు - 5.60 లక్షలు, 
- తల్లిదండ్రులు - 1.95 లక్షల మంది ఉన్నారు. 
- గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 15.7 లక్షల మంది పాల్గొన్నారు.

అయితే, పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారికి వచ్చిన సందేహాలపై సమాధానాలు ఇస్తుంటారు. విద్యార్థులను పరీక్షల కోసం సిద్ధం చేస్తుంటారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)