Breaking News

మహనీయుల భారీ స్మృతి చిహ్నం.. ‍ప్రారంభించిన ప్రధాని మోదీ

Published on Thu, 12/25/2025 - 16:22

లక్నో: భారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా నేడు (గురువారం) దేశానికి ఒక అద్భుతమైన కానుక లభించింది. యూపీలోని లక్నో నగరంలో సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్  తదితరులు పాల్గొన్నారు.

ఈ స్మారక చిహ్నంలో ప్రధాన ఆకర్షణ.. ఆకాశాన్ని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిల 65 అడుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ విగ్రహాలు  భారతదేశ రాజకీయ విలువలకు, నిస్వార్థ ప్రజా సేవకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ,  సందర్శకులలో దేశభక్తిని పెంపొందిస్తున్నాయి.
 

సుమారు 98 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత కళాత్మకంగా కమలం ఆకారంలో ఈ మ్యూజియాన్ని రూపొందించారు. ఇందులో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించారు. తద్వారా ఈ  నాయకుల జీవిత ప్రయాణాన్ని, వారు దేశం కోసం చేసిన పోరాటాలను సందర్శకులు కళ్లకు కట్టినట్లు చూడవచ్చు. ఇది కేవలం స్మారక చిహ్నంగానే కాకుండా ఒక గొప్ప విద్యా కేంద్రంగా కూడా రూపొందింది. 

ఇది కూడా చదవండి: చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)