Breaking News

దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Published on Sun, 03/08/2026 - 17:32

ఢిల్లీ: దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను ప్రధాని ప్రారంభించారు. 12.3 కిలో మీటర్ల పొడవు కలిగిన మజ్లిస్ పార్క్-మౌజ్‌పూర్-బాబర్‌పూర్ (పింక్‌లైన్), 9.9 కిలోమీటర్ల దూరం విస్తరించిన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్‌ (మజెంటా లైన్) కారిడార్‌లను మోదీ ప్రారంభించారు.

మజ్లిస్ పార్క్ - మౌజ్‌పూర్ - బాబర్‌పూర్ కారిడార్.. ఈ కారిడార్‌లో ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మజ్లిస్ పార్క్ - శివ్ విహార్ పింక్ లైన్‌లో భాగంగా ఉంటుంది. ఈ కొత్త మార్గంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71.56 కిలోమీటర్లు. దీంతో ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి 'రింగ్ మెట్రో'గా అవతరించింది. మజ్లిస్‌ పార్క్, బురారీ, జరోడా మజ్రా, జగత్‌పూర్-వజీరాబాద్, సూర్ఘాట్, నానక్సర్-సోనియా విహార్, ఖజూరీ ఖాస్, భజన్‌పురా, యమునా విహార్, మౌజ్‌పూర్-బాబర్‌పూర్ స్టేషన్లు ఉన్నాయి.

ఈ మార్గంలో యమునా నదిపై కొత్త వంతెన, మెట్రో లైన్, రోడ్డు ఫ్లైఓవర్ రెండూ ఉండేలా నిర్మించిన 'డబుల్ డెక్కర్ వయాడక్ట్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపాలి చౌక్ - మజ్లిస్ పార్క్ కారిడార్.. ఇది బొటానికల్ గార్డెన్ - కృష్ణా పార్క్ ఎక్స్టెన్షన్ మెజెంటా లైన్‌కు ఎలివేటెడ్ పొడిగింపు. ఇందులో ఏడు స్టేషన్లు ఉన్నాయి.  ఈ కారిడార్‌ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు.. దీపాలి చౌక్, మధుబన్ చౌక్, ఉత్తర పితాంపుర-ప్రశాంత్ విహార్, హైడర్‌పూర్ విలేజ్, హైడర్‌పూర్ బాద్లీ మోర్, భల్స్వా, మజ్లిస్ పార్క్ స్టేషన్లు ఉన్నాయి. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ కారిడార్ 28.36 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత ఎత్తైనది. వీటితోపాటు మరో మూడు కొత్త కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)