Breaking News

అక్కడే ఆరంభం.. రేపు మరో అద్భుతం ఆవిష్కృతం!

Published on Tue, 03/05/2024 - 19:43

ఢిల్లీ: దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి కోల్‌కతా(పశ్చిమ బెంగాల్‌) మెట్రో వేదిక కానుంది. బుధవారం పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం మెట్రో సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరి దీని ప్రత్యేకలు ఓసారి చూద్దాం.. 

ఈస్ట్‌వెస్ట్‌ మెట్రో కారిడార్‌లో..  హౌరా మైదాన్‌ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్‌ అండర్‌ గ్రౌండ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. హౌరా మైదాన్, హౌరా స్టేషన్‌ కాంప్లెక్స్, బీబీడీ బాగ్‌ (మహాకరణ్‌).  హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్‌ ప్రయాణం సాగనుంది. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్‌  ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. 

ఈ ఫీట్‌ను మోడ్రన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. ఏడు నెలలపాటు ట్రయల్‌ రన్స్‌ జరిపారు. ఇప్పుడు రెగ్యులర్‌ ప్రయాణాలకు అనుమతికి రెడీ చేశారు. 

  • ఈస్ట్‌వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది.  అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు.

  • తాజా అండర్‌ గ్రౌండ్‌ ప్రాజెక్టుతో.. రోజూ ఈ మార్గంలో ఏడు లక్షల మంది ప్రయాణిస్తారని కోల్‌కతా మెట్రో రైల్‌ సీపీఆర్వో అంచనా వేస్తున్నారు
  • ప్రధాని మోదీ మార్చి 6న మెట్రో సర్వీసులను ప్రారంభించగా.. మరుసటి రోజునుంచి ప్రయాణికులను అనుమతిస్తారు
  • ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్‌ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్‌ కోల్‌కతా.
  • హౌరా మెట్రో స్టేషన్.. నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. తద్వారా భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది. 
  • దేశంలో తొలిసారి 1984 అక్టోబర్‌ 24వ తేదీన కోల్‌కతాలోనే మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. సుమారు 3.4 కిలోమీటర్ల దూరంలో ఐదు స్టేషన్లతో తొలి మెట్రో పరుగులు తీసింది నాడు. అదే నగరంలో ఇప్పుడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. 
  • కోల్‌కతా ఈస్ట్వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. దీంట్లో 10.8 కి.మీ.లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంతభాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా.. మిగిలినదంతా  భూ ఉపరితలంపైనే.
  • సొరంగం లోపల అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. 
  • లండన్‌ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్‌ సర్వీసు మాదిరిగా రూపొందించిన సొరంగమార్గం ఇది.
  • ఈ తరహా మెట్రో రూట్‌ ద్వారా.. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించినట్లు అవుతుందని మెట్రో అధికారులు అంటున్నారు. 



 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)