Breaking News

‘శాశ్వత శాంతికి మార్గం సుగమం’: ట్రంప్‌, నెతన్యాహులకు ప్రధాని మోదీ ప్రశంసలు

Published on Thu, 10/09/2025 - 10:42

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి ప్రణాళిక ప్రారంభ దశను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. శాశ్వత శాంతిపై ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ సంఘర్షణల తర్వాత కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రశంసించారు.  దీనిలో బందీలను విడుదల చేయడం, మానవతా సహాయాన్ని పెంచడం  అనేవి కీలకమైన దశలని ప్రదాని మోదీ పేర్కొన్నారు. ఈ పురోగతిలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నాయకత్వాన్ని కూడా ప్రధాని మెచ్చుకున్నారు.
 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక మొదటి దశపై ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతిస్తూ, దీనివెనుక ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వం ఉందన్నారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో ఇలా రాశారు ‘అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళిక మొదటి దశపై ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వానికి ప్రతిబింబం. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం లాంటివి బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తాయని, శాశ్వత శాంతికి మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

దీనికిమందు ‘ట్రూత్ సోషల్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. దీనిని బలమైన,  శాశ్వత శాంతి వైపు మొదటి అడుగుగా అభివర్ణించారు. ‘ఇజ్రాయెల్- హమాస్ రెండూ మేము రూపొందించిన శాంతి ప్రణాళిక మొదటి దశపై సంతకం చేశాయని ప్రకటించడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ ఒప్పందం ప్రకారం బందీలు అతి త్వరలో విడుదలవుతారు. ఇజ్రాయెల్ దళాలు సైనిక చర్యలను ఉపసంహరించుకుంటాయి.  ఇరువర్గాలు న్యాయబద్ధంగా వ్యవహరిస్తాయి. ఇది అరబ్, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కలగల అన్ని దేశాలు ,  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సుదినం. ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదరడానికి మాతో కలిసి పనిచేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తులకు  కృతజ్ఞతలు చెబుతున్నాం. శాంతిదూతలు ధన్యులు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)