Breaking News

అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీ..

Published on Tue, 01/09/2024 - 07:14

రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు.

అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఒ‍క ట్వీట్ చేశారు. తాను ఈ రెండు రోజులు వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని, ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. దీని ద్వారా చాలా మందికి అవకాశాలను సృష్టించినందుకు సంతోషిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. 

ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో సమావేశమవుతారని విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్‌లో  పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈవోలతో ప్రధాని భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ‘గిఫ్ట్ సిటీ’ని సందర్శించనున్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు.

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ గాంధీనగర్‌లో 2024, జనవరి 10 నుండి 12 వరకు జరగనున్నదని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) తెలియజేసింది. ఈ కార్యక్రమం థీమ్ ‘గేట్‌వే టు ది ఫ్యూచర్’. దీనిలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొననున్నాయి.  మీడియాకు అందిన సమాచారం ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9న ఉదయం 9:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిరానికి చేరుకుంటారు. అక్కడ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. దీని తర్వాత గ్లోబల్ టాప్ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)