Breaking News

పట్టాలెక్కిన మరో ఐదు వందే భారత్ రైళ్లు.. పచ్చ జెండా ఊపిన ప్రధాని..

Published on Tue, 06/27/2023 - 13:24

భోపాల్: మధ్యప్రదేశ్‌ నుంచి ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వీటిలో రెండిటిని ప్రత్యక్షంగా ప్రారంభించగా మూడింటిని మాత్రం వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ప్రధాని ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లలో ఇప్పటికి 23 రైళ్లు పట్టాలెక్కాయి. 

మధ్యప్రదేశ్‌ షాహ్ధూల్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మొదట భోపాల్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ చేరుకుని భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం గోవా- ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా వందేభారత్ రైళ్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు.  

ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు ప్రారంభించిన రైళ్లు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతాయని.. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య అనుబంధాలను మరింత  మెరుగుపరుస్తాయని అన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుందని ఆయనన్నారు.  ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. 

ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. అనంతరం దేశంలోని 3000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు.  

ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి..

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)