Breaking News

తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

Published on Fri, 09/20/2024 - 16:35

ముంబై: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ పార్టీపై మరోసారి ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీని అర్బన్‌ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్‌ నడిపిస్తోందన్నారు. ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్‌ కాదని, ఆ పార్టీలో దేశభక్తి లేదన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో శుక్రవారం(సెప్టెంబర్‌20) జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. 

కాంగ్రెస్‌ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేకపోవడం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని విమర్శించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ రైతులను మోసగించిందన్నారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోందని మండిపడ్డారు. 

స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్  దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన అందరికీ తెలుసన్నారు.  అందరం ఏకమై కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి.. ఖర్గే మోదీ కంటే సీనియర్‌.. ఆయనను అవమానిస్తారా: ప్రియాంకగాంధీ  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)