Breaking News

నట్వర్‌ సింగ్‌ మృతికి ప్రధాని మోదీ సంతాపం

Published on Sun, 08/11/2024 - 11:07

భారత విదేశాంగశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నట్వర్‌ సింగ్‌ మృతికి పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో నట్వర్‌సింగ్‌ మృతికి సంతాపం తెలిపారు. ఆయన సేవలను మోదీ కొనియాడారు. ప్రపంచ దౌత్యం, విదేశాంగ విధానాల విషయంలో  నట్వర్‌సింగ్‌ సేవలు అమోఘమన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్‌- యూఎస్ అణు ఒప్పందం విషయంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సింగ్‌ రచనలు పలు అంశాలపై లోతైన అవగాహనను కలిగించాయి.  ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.  

సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో సింగ్‌కు నివాళులర్పించారు. ‘విదేశాంగశా్‌ మాజీ మంత్రి నట్వర్‌సింగ్‌ మృతి వార్త బాధాకరం. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు దీనిని భరించే శక్తిని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)