Breaking News

చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర‌ దిగ్భ్రాంతి

Published on Mon, 11/03/2025 - 11:12

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదే సమయంలో ప్రధాని సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(PMNRF) నుంచి మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సహాయం) అందించబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 చెల్లించబడుతుంది అని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారాయన. 

తాండూరు డిపో నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. మీర్జాగూడ క్రాస్‌ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ లారీ అదుపు తప్పి బస్సును ఢీ కొట్టింది. ఆపై కంకర లోడు మొత్తం బస్సులోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్పాట్‌లోనే కన్నుమూశారు. 

Chevella Road Accident: బస్సు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

తెలంగాణ ప్రభుత్వం మీర్జాగూడ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)